కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలు మానుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఆదివారం కల్వకుర్తి టీఎస్ యూటీఎఫ్ భవన్లో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాలు అనుసరి స్తున్న తీరుకు ఈనెల 26న జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. నిరసన కార్య క్రమాలను విజయవంతం చేయాలని కోరారు.