నాగర్ కర్నూలు జిల్లాకు నూతనంగా ఎంపికై వచ్చిన ఉపాధ్యాయులకు మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించి జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీల ఆధారంగా అవసరమైన పాఠశాలలకు నూతన ఉపాధ్యాయులను భర్తీ చేయనున్నట్లు నాగర్ కర్నూల్ డి ఈ ఓ గోవిందరాజులు సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 210 మంది నూతన ఉపాధ్యాయులను విద్యార్థుల సంఖ్యను ప్రామాణికం ఆధారంగా పాఠశాలలకు ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియను నిర్వహించనున్నట్లు డీఈవో తెలిపారు.