హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం సాయంత్రం మక్తల్ పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. హనుమాన్ ఉత్సవ మూర్తికి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. ప్రధాన రహదారుల గుండా యాత్రను నిర్వహించారు. భక్తి పాటలు, భజనలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. ఎమ్మెల్యే భజనలు చేసి తన భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు, విహెచ్పీ, భజరంగ్ దళ్ నాయకులు పాల్గొన్నారు.