హైద్రాబాద్ లోని ఓ కన్వెన్షన్ హాలులో ఆదివారం జరిగిన మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కుమారుడి వివాహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఆయనను జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి దగ్గరుండి తీసుకెళ్ళారు. అనంతరం వధూవరులను కేటీఆర్ అక్షింతలు వేసి ఆశీర్వదించారు. మాజీ ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మక్తల్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.