ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలి: ఎంపీ డీకే అరుణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్లే జిల్లాలో లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చింది. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. బుధవారం లగచర్ల వెళ్తుండగా మన్నెగూడ వద్ద ఆమె వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీగా నా నియోజకవర్గంలో పరామర్శించొద్దా.? కలెక్టర్ ను కలిసేందుకు అపాయింట్మెంట్ ఉంది అంటూ పోలీసులపై ఎంపీ మండిపడ్డారు.