మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ శివారులోని కురుమూర్తిలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రూ. 110 కోట్ల అంచనా వ్యయంతో ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ. కురుమూర్తి స్వామి ఆలయంలో సదుపాయాలు లేనందున రూ. 110 కోట్లతో ఘాట్ రోడ్డు కారిడార్ నిర్మిస్తున్నామని, కురుమూర్తి స్వామి ఆలయానికి ఏం కావాలో కలెక్టర్ నివేదిక ఇస్తే నిధులు విడుదల చేస్తామన్నారు.