హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన ప్రత్యేక వాహనంలో ఆదివారం మహబూబ్ నగర్ జిల్లాలోని శ్రీ కురుమూర్తి ఆలయానికి సీఎం చేరుకున్నారు. ఆలయానికి సంబంధించి రూ. 110 కోట్లతో ఆలయ ఘాట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మెట్ల మార్గంలోనే కురుమూర్తి స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.