మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేసిన చేప పిల్లలను మంగళవారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కోడూరు గ్రామం చెరువులో ప్రత్యేక పూజలు నిర్వహించి, చేపలు విడిచారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సంవత్సరం మంచి వర్షాలు కురిశాయని, చెరువులన్నీ కూడా నిండుకుండలా ఉన్నాయని ఈ చేపలు మంచి రాబడి ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్ససంఘం అధ్యక్షులు గంజి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.