మహబూబ్ నగర్ జిల్లా నూతన విద్యాధికారిగా ప్రవీణ్ కుమార్ రానున్నారు. ఈయన వికారాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా మహబూబ్ నగర్ జిల్లా విద్యాశాఖ ఏడిగా విధులు నిర్వహిస్తున్న అనసూయ డీఈఓ బాధ్యతలు నిర్వర్తించడానికి విముఖత చూపడంతో ప్రవీణ్ కుమార్ కు బుధవారం బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. గతంలో ఇక్కడ పనిచేస్తున్న డీఈఓ రవీందర్ ఏసీబీకి చిక్కి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.