మహబూబ్ నగర్ జిల్లాలో శుక్రవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ బాలికల ఐటీఐ కళాశాలలో ఏటీసీ ఏర్పాటుకు శంకుస్థాపన, డైట్ కళాశాలలో టాస్క్ కేంద్రం కోసం స్థలం పరిశీలన, రెడ్డి బాలికల వసతి గృహం సమీపంలో వృత్తి శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవం, పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.