దసరా పండుగను పురస్కరించుకొని మహబూబ్ నగర్ రీజియన్ పరిధిలో ఉన్న 10 డిపోలలో రూ. 32 కోట్లు వచ్చాయని రీజియన్ మేనేజర్ తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా 721 ప్రత్యేక బస్సులు నడిపించామని, ఈ దసరా పండుగకు 64 లక్షల ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేర్చామన్నారు. అందులో 41 లక్షల మహిళ ప్రయాణికులు ఉన్నారని, రాష్ట్రంలోనే 109 ఓఆర్ సాధించామన్నారు. 49 లక్షల కిలోమీటర్లు బస్సులను నడపమన్నారు.