నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎల్ఐసి ఆఫీస్ పరిధిలో ఆల్ ఇండియా కమిటీ పిలుపుమేరకు శుక్రవారం నుంచి కొత్త పాలసీల స్వీకరణ నిలిపివేస్తున్నట్లు ఆల్ ఇండియా ఎల్ఐఎఫ్ఐ యూనియన్ ప్రకటించింది. రెగ్యులేటరీ అథారిటీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఏజెంట్లకు నష్టం కలిగించేలా ఉన్నాయని వాటిని ఉప సంహరించుకోవాలని కోరుతూ శుక్రవారం నుంచి 29 వరకు దశలవారీగా నిరసన తెలుపుతామని 14, 21, 29 తేదీల్లో గేట్ ధర్నాలు జరుపుతామన్నారు.