నడక మనిషికి మేలు చేస్తుంది అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వాక్ తాన్ లో పాల్గొని, జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచి ఆరోగ్యం కోసం మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం ముఖ్యం అని, ముఖ్యంగా మహిళలు వారి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలన్నారు.