మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారంలో ఉన్న డిగ్రీ గురుకుల, పీజీ కళాశాలకు న్యాక్ (నేషనల్ అసెస్మెంట్ అక్రిడేషన్ కౌన్సిల్) నుంచి గుర్తింపు లభించిందని సోమవారం కళాశాల ప్రిన్సిపల్ మంజుల తెలిపారు. గత నెల 28, 29న న్యాక్ బృందం కళాశాలలో పర్యటించిందన్నారు. న్యాక్ గుర్తింపు రావడంతో వచ్చే ఐదు సంవత్సరాల పాటు రూ. 5 కోట్ల నిధులు వస్తాయని, కృషి చేసిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ప్రత్యే కంగా అభినందనలు తెలిపారు.