మహబూబ్ నగర్ జిల్లాలో బుధవారం నుంచి నిర్వహించే కుల గణన సర్వేకు అన్ని ఏర్పాట్లు అయ్యాయని కలెక్టర్ విజయేందిర బోయి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2011 జనాభా ప్రకారం. జిల్లాలో 2. 62 లక్షల కుటుంబాలు ఉన్నాయి. జిల్లాలో 2253 బ్లాక్ లుగా విభజించి ఆయా బ్లాక్ లకు 1, 880 మందిని ఎన్యూమరేటర్లను నియమించామని, 10 బ్లాక్ లకు ఒక సూపర్వైజర్ చొప్పున 183 మందిని నియమించారు. ఎన్యూమరేటర్లుగా వివిధ శాఖల సిబ్బందిని నియమించామన్నారు.