ఛైర్మన్ జగదాంబికా పాల్ అధ్యక్షతన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఢిల్లీలో గురువారం కీలక భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జేపీసీ సభ్యరాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. నివేదికలో పొందు పర్చాల్సిన అంశాలపై చర్చించారు. ఇప్పటికే పలు రాష్ట్రాలలో జేపీసీ క్షేత్ర స్థాయి అధ్యయనం చేసి వక్స్ సవరణ బిల్లుపై జేపీసి నివేదిక చివరి దశకు చేరింది. ఈ పార్లమెంట్ సమావేశాలలోనే లోకసభ ముందుకు జేపీసీ నివేదిక ఇవ్వనున్నారు.