మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్ కార్యాలయంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన నూతన బోరు మోటార్ ను శుక్రవారం ప్రారంభించారు. పోలీస్ సిబ్బంది చేత గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఫైర్ స్టేషన్ కార్యాలయంలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్, ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ పాల్గొన్నారు.