గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ వారి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ విశ్రాంత జిల్లా విద్యాధికారి డాక్టర్ శివార్చక విజయ్ కుమార్ ఉమ్మడి పాలమూరులో మంగళవారం 100 రోజులలో 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. మద్యం తగ్గించుట, సేంద్రియ వ్యవసాయాన్ని అభివృద్ధి పరుచుట పలు అంశాలపై చేపట్టిన పాదయాత్రలో విద్యార్థుల్లో, సమాజంలో అవగాహన కల్పిస్తున్నారు. గత నెల 2న ప్రారంభమైన పాదయాత్ర 2025 జనవరి 12 న ముగించనున్నారు.