మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రంలో ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, హన్వాడ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తనిఖీ చేశారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.