మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతం అయినట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఈ శిబిరంలో మొత్తం 51 మంది రక్త దానం చేయడం జరిగిందన్నారు. ఒకరికి రక్త దానం చేయడం అంటే ప్రాణ దానం చేయడంతో సమానం అని అన్నారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్త దానం చేయాలన్నారు.