సైబర్ నేరగాళ్లు చూపే ఆశలకు, ప్రలోభాలకు ఎట్టి పరిస్థితులలోనూ ప్రజలు లొంగకూడదని పోలీసు కళాజాత బృందం సభ్యులు హెచ్చరించారు. మంగళవారం పోలీసు కళాజాత బృందం ఆధ్వర్యంలో జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, సైబర్ నేరానికి గురైతే పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి డయల్ చేయాలన్నారు.