గత కొన్నేళ్ల నుంచి నెలకొన్న రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలంటూ మంగళవారం చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఉదయం 6 గంటల ప్రాంతంలో జోగులాంబ గద్వాల జిల్లా నుంచి డీలర్ల సంఘం నాయకులు బయలుదేరారు. వివిధ గ్రామాల నుంచి అయిజ, గద్వాలకు చేరుకున్న నాయకులు వాహనాల్లో జాతీయ రహదారి గుండా తరలి వెళ్లారు. ఎర్రవల్లి చౌరస్తాలోని జాతీయ రహదారిపై నినాదాలు చేశారు.