అలంపూర్: ఉత్కంఠ భరితంగా మహిళా కబడ్డీ పోటీలు

51பார்த்தது
అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం ఈడిగోనిపల్లిలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం నిర్వహించిన అంతర్రాష్ట్ర ఓపెన్ మహిళా కబడ్డీ టోర్నమెంట్ పోటీలు ఉత్కంఠ భరితంగా కొనసాగాయి. కర్ణాటక, ఏపీ, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి మహిళా క్రీడాకారులు తరలివచ్చారు. 12 జట్లు పోటీల్లో పాల్గొంటాయని నిర్వాహకులు బడే సాబ్ యాదవ్ తెలిపారు. మహిళా కబడ్డీ తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

தொடர்புடைய செய்தி