కురుమూర్తి టెంపుల్ కు ఘాట్ రోడ్డు సంతోషకరం: మంత్రి
కలియుగ దైవంగా కురుమూర్తి దేవస్థానాన్ని భావించి లక్షలాది భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందడం సంతోషకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం కురుమూర్తి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న కోమటిరెడ్డి మాట్లాడుతూ.. 2009లో ఇన్ చార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు కురుమూర్తి దేవస్థానానికి ఘాట్ రోడ్డు మంజూరు చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం. ఇప్పుడు అది నెరవేరినందుకు సంతోషంగా ఉందని చెప్పారు.