మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాత రైతు బజార్ లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కూరగాయల విక్రయదారులలో 50% మంది మాత్రమే రైతులు ఉండి, 50% మంది దళారులు ఉంటున్నారు. రైతుల వద్ద నేరుగా కూరగాయలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన ధరల పట్టికను ఎవరు పట్టించుకోవడం లేదు. మెట్టుగడ్డ హెచ్. డి. ఎఫ్. సి ప్రాంతాలలో ధరలు రెండింతలు అమ్ముతున్నారని సోమవారం పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.