కొత్తకోటలో వైభవంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

84பார்த்தது
దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోటలో విశ్వకర్మ జయంతి వేడుకలను విశ్వబ్రాహ్మణులు భక్తిశ్రద్ధలతో మంగళవారం ఘనంగా నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ స్వర్ణకారుల సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై విశ్వకర్మ, వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాలను పురవీధులలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఊరేగించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు విశ్వమోహన చారి, ఉపాధ్యక్షుడు అరుణ్ చారి, శ్రీనివాసచారి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி