మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలం రాచాల జడ్పీహెచ్ఎస్ పాఠశాల రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు వేదిక కానుంది. నవంబర్ 3, 4, 5 తేదీల్లో ఈ క్రీడాపోటీలను నిర్వహించనున్నారు. అండర్ 17 బాలికలు, అండర్-19 బాలుర రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి తెలిపారు.