భవిష్యత్తులో వరదలు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని గురువారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. పెద్ద చెరువు పూర్తిగా నిండిపోయి అలుగు పారుతున్న విషయాన్ని స్థానిక నాయకులు సిరాజ్ ఖాద్రి, లక్ష్మణ్ యాదవ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.