సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను పురస్కరించుకుని బహిరంగ సభ ఏర్పాట్లను మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయితో కలిసి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శనివారం స్థల పరిశీలన చేశారు. మొదట మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవిఎస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానాన్ని పరిశీలించి, ఆ తర్వాత బూత్ పూర్ మండలం అమిస్తాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బహిరంగ సభ నిర్వాహణకు స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు.