భారతజాతి గర్వించదగ్గ నాయకుడు భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డితో కలిసి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. స్వాతంత్య్ర భారత దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా, భారత విద్యావ్యవస్థను ఉన్నత శిఖరాలకు చేర్చిన గొప్ప మార్గదర్శి అని అన్నారు.