కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రాంగణ పరిసరాలలో ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించరాదని గురువారం మహబూబ్ నగర్ జిల్లా ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. పవిత్ర స్థలమైన కురుమూర్తి స్వామి దేవస్థాన పరిసరాలను అపవిత్రతకు చోటు ఇవ్వకుండా భక్తిశ్రద్ధలతో బ్రహ్మోత్సవాలను కొనసాగించాలని కోరారు. ఈమేరకు జాతరకు వచ్చే భక్తులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.