దేవరకద్ర: భార్య, అత్తపై వేటకొడవలితో దాడి.. అల్లుడిపై కేసు

50பார்த்தது
దేవరకద్ర: భార్య, అత్తపై వేటకొడవలితో దాడి.. అల్లుడిపై కేసు
దేవరకద్ర మండలంలోని గుడిబండలో ఆదివారం భార్య, అత్తపై అల్లుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఎస్ఐ నాగన్న వివరాల ప్రకారం. గుడిబండ గ్రామానికి లక్ష్మికి మదనాపురం మండలం కొల్లూరు గ్రామానికి చెందిన కుర్మయ్యతో 8 ఏండ్ల కిందట పెండ్లి అయింది. భార్య గత కొన్ని రోజులుగా కాపురానికి రావడం లేదని అత్త బోయ నిర్మలమ్మ (50), భార్య లక్ష్మమ్మ (30)లపై వేట కొడవలితో దాడికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி