UP మదర్సా చట్టానికి అనుకూలంగా తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ఒక విషయంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫాజిల్, కామిల్ వంటి డిగ్రీలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఇవి UG నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని, పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తాయని వెల్లడించింది. మైనారిటీ స్టూడెంట్స్ బయటకెళ్లి గౌరవంగా బతికేలా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపింది. ఈ చట్టాన్ని 2004లో ములాయం సింగ్ యాదవ్ తెచ్చారు.