పురాణాల ప్రకారం, బాలగణపతి ఒకనాడు శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రాన్ని చూసి ముచ్చటపడి దానిని అమాంతం మింగేస్తాడు. విష్ణువు సుదర్శన చక్రం కోసం కైలాసమంతా వెతకసాగారు. అప్పుడు గణేశుడు సుదర్శన చక్రాన్ని తానే మింగేసానని చెబుతాడు. గణేశుని ప్రసన్నం చేసుకోవడానికి విష్ణుమూర్తి కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకుని గుంజీలు తీస్తాడు. అప్పుడు గణేశుడు నవ్వడం వల్ల సుదర్శన చక్రం నోట్లోంచి బయటకు వచ్చేస్తుంది.