రజనీకాంత్ 171వ చిత్రం ‘కూలీ’లోని ఓ సన్నివేశం లీక్ కావడంపై దర్శకుడు లోకేశ్ కనగరాజ్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘‘ఒక్క వీడియో లీక్‌తో ఎంతో మంది రెండు నెలలుగా పడిన కష్టం వృథా అయింది. దయచేసి లీక్ సీన్‌ను ఎవరూ ప్రోత్సహించొద్దు’’ అని విజ్ఞప్తి చేశారు. షూటింగ్లో భాగంగా తాజాగా విశాఖపట్నంలో హీరో నాగార్జునపై పోరాట ఓ సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఆ దృశ్యాలను ఎవరో ఫోన్లో బంధించి ఎక్స్‌లో పోస్ట్ చేయగా ఆ వీడియో వైరల్ అవుతోంది.