TG: శ్రీశైలం - హైదరాబాద్ హైవేపై అర్ధరాత్రి చిరుతపులి కనిపించడంతో ప్రయాణికులు షాకయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా వటవర్లపల్లి వద్ద చిరుత రోడ్డు దాటుతుండగా కారులోని ప్రయాణికులు వీడియో తీశారు. దీనిని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అధికారులు నిర్ధారించారు. రాత్రి సమయంలో ఇక్కడ జంతువులు రోడ్డు దాటుతుంటాయని తెలిపారు. అడవిని ఆనుకుని ఉన్న రహదారులపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రయాణికులకు సూచించారు.