లగచర్ల బాధితులకు ప్రభుత్వం భేషరతుగా క్షమాపణలు చెప్పి వారిని వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. బాధితులపై థర్ట్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలే స్కెచ్ వేసి దాడులు చేశారని ఆరోపించారు. ఈ ఘటనలో అరెస్టు అయిన 16 మంది బాధితులను సోమవారం సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఎంపీలు ఈటల, డీకే అరుణ, నేతలు ములాఖత్ అయ్యారు. దాడి ఘటనలో ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు.