ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డికి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వజూపిన రూ. 1 కోటి నగదు పారితోషికం, ప్లాట్‌ను తిరస్కరించడం తెలంగాణ అస్థిత్వ పరిరక్షణలో ఒక మైలురాయిగా నిలుస్తుందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిధారెడ్డి నివాసంలో ఆయన్ను KTR మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో సిధారెడ్డి చూపిన నిబద్ధత, తెగువ తెలంగాణ చరిత్రలో చిరకాలం నిలిచి ఉంటుందని అన్నారు.