ఇల్లందు ఏరియా పరిధిలోని జెకె 5, కోయగూడెం ఓసీలో పనిచేసే అధికారులు, కార్మికుల టీం వర్క్ తోనే ఉత్పత్తి లక్ష సాధన సాధ్యమైనదని ఏరియా జనరల్ మేనేజర్ జాన్ ఆనంద్ గురువారం అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కోయగూడెం ఓసీ, జెకె 5 ఓసీలో కలిపి సుమారు రూ. 871 కోట్ల వ్యాపారం జరిగిందని, కొత్త ఓసీ ప్రారంభమైతే విధించిన లక్ష్యాన్ని పూర్తి చేయగలుగుతామని జీయం అన్నారు.