రాష్ట ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలలో పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చుటకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో భాగంగా శుక్రవారం ఇల్లందు నియోజకవర్గం గార్ల మండల పినిరెడ్డిగూడెం ప్రజలు పారదర్శకంగా అధికారులకు సహకరించాలని ఇందిరమ్మ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు నవీన్, బిక్షపతి, మల్లేష్, భాగ్యలక్ష్మి, వి. అచ్చమ్మ ఉన్నారు.