ఇల్లందు నియోజకవర్గ గార్ల మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు గాజుల గణేష్ తండ్రి అయిన రాజయ్య(72) దశదినకర్మలకు గురువారం మాజీ ఎంపీపీ శివాజీ చౌహన్, మాజీ ఎంపీటీసీ శీలంశెట్టి రమేష్ హాజరై నివాళులు అర్పిస్తున్నారు. వారితో పాటు ఏవో కావటి రామారావు, మండల బిఆర్ఎస్ నాయకులు, గార్ల మండల పుర ప్రముఖులు బుడగ మురళి, బాదావత్ రవి, కత్తుల ప్రశాంత్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.