ఇల్లందు సొసైటీ గోడౌన్, షాపు, ఎరువుల స్టాక్, రిజిస్టర్, ఈపాస్ మెషిన్లను డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు అజ్మీర శ్రీనివాస్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు ఎరువులు ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని, బిల్లుపై రైతు సంతకం ఉండాలన్నారు. ఎరువుల అమ్మకంలో నిబంధనలు పాటించాలని స్టాక్ రిపోర్ట్ ప్రతి రోజు మండల వ్యవసాయ అధికారికి పంపించాలని అన్నారు.