5వ విడత పల్లెప్రగతి ప్రణాళికా కార్యాచరణ అద్భుతం :సర్పంచ్

1026பார்த்தது
5వ విడత పల్లెప్రగతి ప్రణాళికా కార్యాచరణ అద్భుతం :సర్పంచ్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి లో భాగంగా 5వ విడత కార్యాచరణ ప్రణాళిక సాధించిన విజయాలు గురించి జాన్4 తారీకున తాళ్లగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో చర్చించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలందరూ తమవంతుగా ప్రతి ఒక్కరూ తమఇంటి ఆవరణలో పరిశుభ్రతను పాటించాలి అని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోవాలి అని వారు స్పష్టంచేశారు. అదే విధంగా ఒకరోజు పవర్ డే గా పాటించాలి అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లకావత్ సునీత, ఎంపీటీసీ నల్లమోతు లక్ష్మయ్య, ఉపసర్పంచ్ పుచ్చకాయల సత్యనారాయణ, మరియు స్పెషల్ ఆఫీసర్ గారు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி