తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు ధనసరి సూర్య గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మణుగూరు మండలంలో గల ఆదివాసి గిరిజన గ్రామమైన రైల్వే స్టేషన్ పక్కన గల రాయన్న పేటలో గ్రామంలో సూర్య టీం సభ్యులు కూరగాయలు, బ్రేడ్ పంపిని చేశారు. ఈ గ్రామానికి రోడ్ సదుపాయం లేదు అని గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారని సూర్య టీం సభ్యుల దృష్టికి రావడంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి సూర్య టీం సభ్యులు ఆ గ్రామానికి చేరుకొని గ్రామస్తులకు, గర్భిణీ స్త్రీలకు కూరగాయలు బ్రేడ్ పంపిని చేశారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల యువజన అధ్యక్షులు రసమల్లా నాగరజు, యువజన నాయకులు పులిపాటి పాపరావు, జంగం శ్రీనివాస్, బానోత్ అనిల్, తౌడా సతీష్, రమణధం మారయ్య, పినపాక నియోజకవర్గం సోషల్ మీడియా వారియర్ అచ్చా. నవీన్ పాల్గొన్నారు.