పినపాక మండల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఆరు కాలం పండించిన వరి ధాన్యం కుప్పలు రోడ్డుపై ఆరపోసి ప్రమాదాలకు కారణం కాకూడదని ఈ బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం అన్నారు. ఈ సందర్భంగా ఆయన రహదారిపై ఆరబోసిన ధాన్యం కుప్పలను పరిశీలించి రైతులకు అవగాహన కల్పించారు. రైతులు ఎవరు రోడ్డుపై ధాన్యం ఆరబోయరాదని హెచ్చరించారు. ధాన్యం కుప్పల పై వాహనం నడిపే ప్రమాదం జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు.