తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదర్శవంతమైన పాలన కొనసాగుతోందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. పినపాక మండల పరిధిలోని పోట్లపల్లి, మల్లారం గ్రామాల్లో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. పంచాయతీల్లో నిర్వహించిన ప్రజా పాలన సమీక్షా సమావేశాల్లో పాల్గొన్నారు. సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు.