మావోయిస్టు పార్టీ వార్షికోత్సవాలు ఎందుకు జరుపుకోవాలని ప్రశ్నిస్తూ ఆదివాసీ సంఘాల పేరిట గురువారం చర్ల మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో పెద్ద ఎత్తున కరపత్రాలు వెలిశాయి. మావోయిస్టు పార్టీ వల్ల మా ఆదివాసుల బ్రతుకులు ఏమి మారాయి? గత 20 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీ వల్ల ఆదివాసి ప్రజలకు ఒరిగింది ఏమిటి? అంటూ కరపత్రాలలో పలు ప్రశ్నల వర్షం కురిపించాయి.