మణుగూరు ఏరియా సింగరేణి ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ ను నియమించాలని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి రాంగోపాల్ అన్నారు. శనివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి అధికారులకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. కార్మికులకు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పెరక్స్ పై ఇన్కమ్ టాక్స్‌ను కంపెనీయే చెల్లించాలని చెప్పారు. అలాగే పివి కాలనీలో ఇంటర్నల్ రోడ్డు నిర్మించాలని పేర్కొన్నారు.