బూర్గంపహడ్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ నుండి జనార్ధన్ టెంట్ హౌస్ వరకు ఉన్న రహదారి ఎన్నో ఏళ్లుగా గొతులతో కూడుకొని వాహనదారులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఎమ్మెల్యే రేగా, బీఆర్ఎస్ నాయకుల కోరిక మేరకు దాదాపు 15 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు మంజూరైంది. బుధవారం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి సీసీ రోడ్డు నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.