సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర కుటుంబ సర్వే) కు పినపాక మండలంలో అన్నీ సిద్ధమైనట్లు డిప్యూటీ తహశీల్దార్ సమ్మయ్య తెలిపారు. శుక్రవారం ప్రతి ఇంటికి గుర్తింపు స్టిక్కర్లను అంటించనున్నారు. కుటుంబ సర్వేకు కావలసిన వస్తు సామాగ్రిని అధికారులు సిబ్బందికి పంపిణీ చేయనున్నారు. సర్వేను సమయంలో పూర్తి చేయాలని తోటి ఉద్యోగులకు సూచించారు.